NTV Telugu Site icon

Telangana new secretariat inauguration: నేడే డాక్టర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం ప్రారంభం

Telangana New Secretariat

Telangana New Secretariat

Telangana secretariat inauguration: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీహోమంలో పాల్గొన్నారు. 110 మంది వేదాంతులు, రుత్విక్కులు సచివాలయంలో హోమం, యాగ నిర్వహణ, వివిధ ఛాంబర్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. శృంగేరి పీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ, వాస్తు పండిట్ సుద్దాల సుధాకర తేజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

Read also: China Birth Rate: పెళ్లికాకున్నా ఫర్వాలేదు.. పిల్లలు పుట్టడం కావాలి

మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకుంటారు. నేరుగా హోమశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొంటారు. అనంతరం మహాద్వారం వద్ద శిలా ఫలకాన్ని ఆవిష్కరించి కొత్త సచివాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కింది అంతస్తులో వాస్తు పూజలో సీఎం పాల్గొంటారు. సచివాలయం ప్రధాన గేటును సీఎం కేసీఆర్ తెరవనుండగా, మంత్రులందరూ తమ తమ కార్యాలయాలను ఒకేసారి తెరవనున్నారు. ఆయా శాఖల కార్యాలయాల్లోనూ అధికారులు కూర్చోనున్నారు. మధ్యాహ్నం 1:20 నుంచి 1:32 గంటల మధ్య పూర్ణాహుతి నిర్వహించి, అనంతరం ఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో కూర్చుని ఫైల్‌పై సంతకం చేయనున్నారు. మంత్రులందరూ మధ్యాహ్నం 1:56 నుండి 2:40 గంటల మధ్య తమ తమ కార్యాలయాల్లో కూర్చుంటారు. సరిగ్గా మధ్యాహ్నం 2:15 నుంచి 2:45 గంటల మధ్య సచివాలయ ఉద్యోగులు, మంత్రులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రత్యేక భోజన ఏర్పాట్లు కూడా చేశారు.

Read also: Muskan Narang: ఇదే నా చివరి వీడియో అంటూ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయం రాష్ట్ర పరిపాలనా అవసరాలకు సరిపోకపోవడంతో ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. 2020 నవంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ‘షాపూర్జీ-పల్లోంజీ’తో ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయ నిర్మాణ పనులు 4 జనవరి 2021న ప్రారంభమయ్యాయి. రికార్డు స్థాయిలో 26 నెలల కాలంలో 10 లక్షల 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతమైన సచివాలయ భవనాన్ని నిర్మించారు. ఇంత త్వరగా పూర్తి చేసిన ప్రభుత్వ భవనం దేశంలో మరొకటి లేదు. కరోనా వంటి విపత్తు సమయంలో కూడా, పని నిరాటంకంగా కొనసాగింది.

Show comments