Site icon NTV Telugu

Wine Shops : తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల అప్లికేషన్లు.. ఎక్సైజ్ శాఖ అప్‌డేట్

Liquor Prices

Liquor Prices

Wine Shops : డిసెంబర్ 1 నుండి తెలంగాణలో ప్రారంభం కానున్న నూతన మద్యం దుకాణాల కోసం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులు సెప్టెంబర్ 26 నుంచి స్వీకరిస్తున్నారు. ఇప్పటికే శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 447 దరఖాస్తులు నమోదు అయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుండి దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం ఉంది.

Sobhita : నేను ఇండియన్ అంకుల్ లాగా ఉంటా.. శోభిత షాకింగ్ పోస్టు

మేడ్చల్ యూనిట్ పరిధిలో ఉన్న 118 కొత్త మద్యం దుకాణాల కోసం ఇప్పటివరకు 20 దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తం దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 18 వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు నిర్వహకులను ఎంపిక చేసుకోవడం కోసం అక్టోబర్ 23న లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫారంతో పాటు ప్రతి దరఖాస్తుదారు రూ. 3 లక్షల డీడీ లేదా చలాన్ రూపంలో చెల్లించిన రశీదు జతపరచాల్సి ఉంటుంది.

ఈ కొత్త దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీ కేటగిరీకి 10 శాతం, ఎస్టీ కేటగిరీకి 5 శాతం రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి. డీడీలు మరియు చలాన్లను జిల్లా ప్రొహిబిషనర్ & ఎక్సైజ్ అధికారి (DPO) పేరునే తీయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు, రిజర్వేషన్ల వివరాలు, దరఖాస్తు గైడ్‌లైన్స్‌ను tgbcl.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది.

Bunny Vasu : షాకింగ్.. 45 రూపాయలతో డిస్ట్రిబ్యూటరయిన బన్నీ వాసు

Exit mobile version