Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
- నాలుగు జిల్లాలకు కొత్త డీఈఓల నియామకం
- ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు
- వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రికి కొత్త అధికారులు
- తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్య శాఖ పరిధిలోని పలు జిల్లాల్లో విద్యా పరిపాలనను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు నూతన జిల్లా విద్యాశాఖాధికారులను (డీఈఓ) పూర్తి అదనపు బాధ్యతలతో (FAC) నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సెప్టెంబర్ 28, 2026న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య జీవో ఆర్టీ నంబర్ 175ను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా, జిల్లాల్లో విద్యా పరిపాలన సజావుగా సాగేందుకు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ అదనపు బాధ్యతలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జిల్లాల వారీగా డీఈఓ బాధ్యతలు పొందిన అధికారులు
ఈ నియామకాల ప్రకారం, కరీంనగర్ డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్. ప్రశాంత్ రెడ్డిని వరంగల్ జిల్లా డీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. అలాగే నిర్మల్ డీఈఓ కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా (అసిస్టెంట్ డైరెక్టర్) ఉన్న సిహెచ్. శ్రీనివాసరావును సూర్యాపేట జిల్లా డీఈఓగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read
మరోవైపు, భద్రాద్రి కొత్తగూడెం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డి. వాసంతిని ఖమ్మం జిల్లా డీఈఓగా (ఎఫ్ఏసీ) నియమించారు. ఇప్పటివరకు ఖమ్మం డీఈఓగా అదనపు బాధ్యతల్లో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి. సదానందం స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శంభు ప్రసాద్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ఈ నూతన నియామకాలతో ఆయా జిల్లాల్లో పాఠశాల విద్యాశాఖ పరిపాలనా పనులు మరింత వేగవంతం కానున్నాయి.
తాజావార్తలు
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Dharman: ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. నాలుగోసారి క్రేజీ కాంబో రిపీట్!
-
KTR : 2028లో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!