Site icon NTV Telugu

Local Body Elections : ఈసీ కీలక నిర్ణయం.. ఎన్నికల నోటిఫికేషన్‌ సస్పెండ్‌

Local Body Elections

Local Body Elections

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న MPTC, ZPTC ఎన్నికలపై జారీ చేసిన గెజిట్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు మేరకు సెప్టెంబర్‌ 29న విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Hyderabad Drugs: రూటు మార్చిన డ్రగ్ స్మగ్లర్లు.. కొంపలోనే కుంపటి పెట్టారు!

హైకోర్టు ఆదేశాలు అందిన వెంటనే ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్‌ గెజిట్‌ విడుదల చేయనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చిన మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కూడా తాత్కాలికంగా రద్దు అవనుంది. ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలా లేదా అన్నదానిపై హైకోర్టు తుది ఆదేశాల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వేళ ఊపందుకున్న రాజకీయ వాతావరణం కొంత శాంతించింది.

Nalgonda Crime: మాయమాటలు చెప్పి బాలికను స్నేహితుడి రూమ్‌కు తీసుకెళ్లిన కామాంధుడు.. చివరకు?

Exit mobile version