Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minor Girl Abused: రక్షణగా నిలవాల్సిన కన్నతల్లే కాసులకు కక్కుర్తిపడి మౌనం వహించడంతో, ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే ఓ అభాగ్య బాలిక కామాంధుల చేతిలో చిక్కి నరకం అనుభవించిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుసగా లైంగిక దాడులకు పాల్పడిన ముగ్గురు నిందితులతో పాటు, వీరికి సహకరించిన బాలిక తల్లిని తాండూరు పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కోసిగి మండలం ఎరుపుమల్ల గ్రామానికి చెందిన ఒక మహిళ భర్త చిన్న వయసులోనే మృతి చెందాడు. దీంతో ఆమె తన కూతురితో కలిసి గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈ క్రమంలో అదే గ్రామానికి లక్ష్మీ ప్రసన్నకుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.
కరోనా సమయంలో లక్ష్మీ ప్రసన్నకుమార్, ఆ మహిళను, ఆమె కూతురిని తీసుకొని పూడూరు మండలం ఎన్కేపల్లి గ్రామంలోని ఓ మామిడి తోటలో పనికి చేరారు. అక్కడ ఉంటున్న సమయంలో అప్పటికి కేవలం 8 సంవత్సరాల వయసున్న బాలికపై పినతండ్రి వరసయ్యే లక్ష్మీ ప్రసన్నకుమార్ తరచూ లైంగిక దాడికి పాల్పడేవాడు. అదే సమయంలో పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో పనిచేసే ఎన్కేపల్లి కృష్ణ అనే వ్యక్తి కూడా బాలికపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. అక్కడి నుంచి వీరు 2022లో తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు సమీపంలో అద్దె ఇంటికి మారారు. ఆ ఇంట్లోనే మరో గదిలో అద్దెకు ఉంటున్న మిట్టబాస్పల్లి గ్రామానికి చెందిన అమృతప్ప అనే వ్యక్తి కన్ను కూడా ఆ బాలికపై పడింది. అతడు కూడా ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Also Read
- TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
- Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన "ఇండియాస్ మావోయిస్ట్స్" పుస్తకావిష్కరణ
- Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
- Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
తాండూరు నుంచి వీరు 2025లో జీవనోపాధి కోసం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లికి వలస వెళ్లారు. అక్కడ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బాలికను చేర్పించారు. ఇటీవల పాఠశాలలో ఆ బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో, గమనించిన ఉపాధ్యాయులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలిక తాను ఎనిమిదేళ్ల వయస్సు నుంచి అనుభవిస్తున్న నరకాన్ని, పలువురు సాగించిన లైంగిక దాడిని ఉపాధ్యాయులకు వివరించింది. విషయం తీవ్రతను గుర్తించిన ఉపాధ్యాయులు వెంటనే బాలల పరిరక్షణ కమిటీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) సభ్యులను అప్రమత్తం చేశారు. వారి సహకారంతో బాలిక ద్వారా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు.
ఫిర్యాదు స్వీకరించిన యాదగిరిగుట్ట పోలీసులు ప్రాథమికంగా ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి, నేరాలు జరిగిన వికారాబాద్ జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. కేసును సీరియస్‌గా తీసుకున్న తాండూరు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన లక్ష్మీ ప్రసన్నకుమార్, ఎన్కేపల్లి కృష్ణ, అమృతప్పలతో పాటు, నేరం జరుగుతున్నట్లు తెలిసినా అడ్డుకోకుండా వారికి సహకరించిన బాలిక తల్లిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్‌కు పంపించారు.
తాజావార్తలు
-
Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
-
Mouli: ఐదో తరగతిలో భయపడి ఏడ్చా.. ఇప్పుడు మైత్రీ మూవీస్‌తో సినిమా
-
Ashwini Vaishnaw : జర్నలిజానికి డీపీఎడీపీ చట్టంతో ముప్పు లేదు
-
Tiny Holes in Clothes: అల్మారాలోని బట్టలకు చిన్న రంధ్రాలా? ఎలుకలు కాకపోవచ్చు.. ఈ కీటకాలతో జాగ్రత్త!
-
BJP: ఎస్పీ గెలవకూడని చోట్ల గెలిచింది.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..