Site icon NTV Telugu

తెలంగాణ‌లో మ‌రో మంత్రికి క‌రోనా.. రెండోసారి పాజిటివ్‌..

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది.. ఒమిక్రాన్ వేరియంట్ రూపంతో మ‌రిసారి దాడి చేస్తూ.. థ‌ర్డ్ వేవ్‌కు కార‌ణం అయ్యింది.. అయితే, థ‌ర్డ్ వేవ్ క‌ల్లోలం లోనూ ఇప్ప‌టికే ఎంతో మంది కేంద్ర మంత్రులు, రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఉన్న‌తాధికారులు.. ఇలా ఎంతో మందిని కోవిడ్ ప‌ల‌క‌రించింది. ఇక‌, సినీ ప్ర‌ముఖుల్లోనూ సూప‌ర్‌స్టార్‌, మెగాస్టార్‌.. ఇలా చాలా మంది హీరోలు సైతం కోవిడ్ బారిన‌ప‌డ్డారు.. తాజాగా, తెలంగాణ‌కు చెందిన మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.. వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఈ రోజు నిర్వ‌హించిన క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది..

Read Also: వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్ల‌కు శుభ‌వార్త‌.. !

ఈ విష‌యాన్ని మీడియాకు తెలియ‌జేశారు మంత్రి నిరంజ‌న్‌రెడ్డి.. మ‌రోవైపు గత మూడు రోజులుగా మంత్రి నిరంజ‌న్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా గ‌డిపారు.. ఈ స‌మ‌యంలో.. ఆయ‌న‌ను అనేక మంది క‌లిసిశారు.. అయితే, నిన్న, మొన్న, ఈ రోజు త‌న‌ను దగ్గరగా కలిసిన వారంతా వెంట‌నే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, త‌గిన జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు మంత్రి నిరంజ‌న్‌రెడ్డి. ఇక‌, నిరంజ‌న్‌రెడ్డికి క‌రోనా సోక‌డం ఇది రెండో.. సారి.. గ‌త ఏడాది ఏప్రిల్‌లోనూ ఓసారి కోవిడ్ బారిన‌ప‌డ్డారాయ‌న‌.

Exit mobile version