వర్షాకాలంలో ప్రాణాపాయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్ తో సహా ఉన్నతాధికారులు కొంత కాలంగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో వర్షాకాలంలో ప్రాణాపాయం వంటి ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారులు కొత్త కాలంగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో గడువు దగ్గరపడుతుండటంతో..అధికారులు పనులను ముగించే పనులలో నిమగ్నమయ్యారు.
ఈ నెల 5లోగా రక్షణ చర్యలన్నీ తీసుకోవాలని.. నాలాలు, మ్యాన్‌హోళ్ల వంటి ప్రాంతాలతోపాటు రోడ్లు, ఫుట్‌పాత్‌ల మార్గాల్లో సైతం గోతులుండరాదని మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ మెమో జారీ చేసిన నేపథ్యంలో.. నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ప్రాణాపాయం జరిగితే ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తుందని పనులు సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. నాలా సేఫ్టీలో భాగంగా చేపట్టాల్సిన పనులతో పాటు ఇతర ప్రాంతాల్లోని పనుల్ని సైతం వెంటనే పూర్తిచేయాలని, పూర్తయ్యే అవకాశం లేని ప్రాంతాల్లో బారికేడింగ్స్‌తో పాటు ఇతరత్రా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారుల టీమ్స్‌కు నాలుగైదు రోజుల క్రితమే సర్క్యులర్లు జారీ చేశారు. సేఫ్టీ ఆడిట్‌లో భాగంగా రక్షణ ఏర్పాట్లు నూరు శాతం ఉన్నట్లు నిర్ధారించుకొని ధ్రువీకరించాలని పేర్కొన్నారు.
Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. త్వరలో పీఎంశ్రీ స్కూల్స్
