NTV Telugu Site icon

KTR: వ‌న దేవ‌త‌ల‌కు నిలువెత్తు బంగారం..

తెలంగాణ కుంభమేళ, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో వైభవంగా సాగుతోంది.. సమ్మక్మ, సారలమ్మ గద్దెలను దర్శించుకోవడానికి మేడారినిక భక్తులు పోటెత్తుతున్నారు.. వీఐపీల తాకిడి కూడా భారీగానే ఉంది.. ఇక, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి, టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. తన ప‌ర్యట‌న‌లో భాగంగా ఓబుళాపూర్‌లో స‌మ్మక – సార‌ల‌మ్మ జాత‌ర‌లో పాల్గొన్నారు.. ఇక, వ‌న దేవ‌త‌ల‌కు నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన ఆయన.. మొక్కులు చెల్లించుకున్నారు. స‌మ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కేటీఆర్..

Read Also: Kala Venkata Rao : అప్పుడు వాతలు.. ఇప్పుడు కోతలు..