తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా.. కొత్త కంపెనీలను ఆకర్షించడమే ధ్యేయంగా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం.. పర్యటనలు కొనసాగిస్తూనే ఉన్నారు తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్… ఇటీవలే కేటీఆర్ టీమ్.. అమెరికాలో పర్యటించింది.. వారం రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో.. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ, ఇన్నోవేషన్ వంటి నాలుగు సెక్టార్లలో పలు కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఈవెంట్లు, 35 వరకు బిజినెస్ సమ్మిట్లలో పాల్గొన్నారు… ఈ సందర్భంగా.. రూ.7,500 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించే విధంగా ప్రయత్నాలు సాగించారు.. ఇక, తాజాగా కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది.
Read Also: Rachakonda: మామూలు దొంగ కాదు.. ఏ ఇంట్లో దొంగతనం చేయాలో కల వస్తుందట..!
ఇప్పటికే పలు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనే అరుదైన అవకాశాలను దక్కించుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను.. ఇప్పుడు అమెరికాకు చెందిన మిల్కెన్ ఇన్స్టిట్యూట్ తమ 25వ వార్షిక అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానించింది… లాస్ ఏంజిల్స్ లో మే 1 నుంచి 4వ తేదీ వరకు సెలబ్రేటింగ్ ద పవర్ ఆఫ్ కనెక్షన్ పేరుతో జరగనున్న సదస్సులో పాల్గొని ప్రసంగించాల్సిందిగా కోరింది.. ఇక, ప్రపంచవ్యాప్తంగా పలువురు రాజకీయ, ఆర్థిక, వైద్య రంగాల ప్రముఖులు, వ్యాపార వేత్తలు, నిపుణులు ఈ సదస్సులో ప్రసంగించబోతున్నారు.. ఈ నేపథ్యంలో తనకు ఆహ్వానం అందడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.. తనను ఆహ్వానించిన మిల్కెన్ ఇన్స్టిట్యూట్కు ధన్యవాదాలు తెలిపారు.