Telangana Lok Sabha Election Results 2024: రాజధానిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుండగా, అసెంబ్లీ సెగ్మెంట్లలో తొమ్మిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. ముందుగా ఉదయం 5.30 గంటలకు ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో ఉద్యోగులకు విధులు కేటాయిస్తారు. ఓట్ల లెక్కింపులో దాదాపు ఆరు వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు.
Read also: Pithapuram Elections Results: పిఠాపురంలో రికార్డు పోలింగ్.. పవన్ కల్యాణ్ మెజార్టీపై ఆసక్తి!
మొత్తం నలుగురు ఎంపీలు మరియు కంటోన్మెంట్ అసెంబ్లీ కోసం 9,859 పోలింగ్ కేంద్రాల ఓట్లను 546 టేబుళ్లపై లెక్కించనున్నారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల కేంద్రాల్లోని సఫారెట్ హాల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల అధికారి రొనాల్‌డ్రాస్ తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల కౌంటింగ్ సెంటర్‌లో, సికింద్రాబాద్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో జరుగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి సీఎస్‌ఐఐటీ, వెస్లీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు.
Lok Sabha Election : 2014, 2019లో రాష్ట్రాల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే ?