NTV Telugu Site icon

మద్యం షాపుల లైసెన్స్‌ గడువు పొడిగింపు..

మరోసారి మద్యం షాపుల లైసెన్స్‌ గడువు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం.. రెండో దశ కరోనా మహమ్మారి కారణంగా వైన్స్‌ షాపులు మూత పడటంతో లైసెన్స్‌లను నెల రోజుల పాటు పొడిగించింది ప్రభుత్వం. కరోనా కారణంగా మూతపడిన కారణంగా… బార్లు, వైన్స్‌ల లైసెన్సులను మరో నెల పాటు పొడిగించింది. అక్టోబర్‌ చివరినాటికి ముగియనున్న మద్యం దుకాణాల లైసెన్సుల గడువును నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈనెల ఆఖరు వరకు బార్ల లైసెన్సుల గడువు ముగియనుండగా.. నెలరోజుల పొడిగింపుతో అక్టోబర్‌ 31 వరకు కొనసాగనున్నాయి. 2019 -21 సంవత్సరానికి రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సులను నవంబర్‌ 1వ తేదీ 2021 నుంచి 30 నవంబర్‌ 2021 పొడిగిస్తూ ఆ ఉత్తర్వులో పేర్కొంది సర్కార్.