Site icon NTV Telugu

ఇవాళ్టి నుంచి తెలంగాణలో పెరిగిన భూముల రేట్లకు రెక్కలు

Land Market Value

Land Market Value

తెలంగాణలో పెరిగిన భూముల ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి సబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. కొత్త ధరలు, విధి విధానాలు ఖరారు చేసింది. మొత్తం మూడు స్లాబుల్లో భూములు రేట్లు పెంచింది సర్కార్‌.

తెలంగాణలో పెరిగిన భూముల ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే రేట్ల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్‌… వ్యవసాయ భూములపై 50 శాతం పెంచింది. కనిష్ఠ మార్కెట్‌ విలువ ఎకరాకు 75 వేలుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా ఏరియాల్లో ఉన్న మార్కెట్ విలువలకు అనుగుణంగా 3 స్లాబ్‌లు చేసింది. ఓపెన్‌ ప్లాట్ల చదరపు గజం కనీస ధర 100 రూపాయల నుంచి 200లకు పెంచిన సర్కార్… 50 శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన శ్లాబులుగా చేసింది. అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ 800 నుంచి 1000కి పెంచిన ప్రభుత్వం.. చదరపు అడుగుపై 20 శాతం, 30 శాతం లెక్కన పెంచింది.

read also : జులై 13, మంగళవారం దినఫలాలు

ఆదాయ వనరులు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2013లో భూముల విలువను సవరించింది… అప్పటి ప్రభుత్వం. అప్పటి నుంచీ ల్యాండ్ వాల్యూస్ రివైజ్‌ చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం రెట్టింపు కావడంతో భూముల విలువ పెంచింది సర్కార్‌. కేబినెట్‌ సబ్‌ కమిటీ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది.

పెంచిన భూముల ధరలు ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు అధికారులు. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు గిఫ్ట్ డీడ్, కుటుంబీకుల మధ్య రిజిస్ట్రేషన్లు, ఒప్పందాల రేట్లు కూడా పెరగనున్నాయి.

Exit mobile version