NTV Telugu Site icon

KTR 47th Birthday: నేడే కేటీఆర్ 47వ పుట్టినరోజు.. అలా చేస్తానంటూ ప్రతిజ్ఞ

Ktr

Ktr

KTR 47th Birthday: నేడు తెలంగాణ యంగ్‌ డైనమిక్స్‌ మినిస్టర్‌ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు బర్త్‌డే శుభాకాంక్షలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నారు. అదిరిపోయే సీడీపీలు, ఉర్రూతలూగించే పాటలతో తెగ హంగామా చేస్తున్నారు. ఓ అభిమాని కేటీఆర్ ను సూపర్‌ మ్యాన్‌ తో పోలుస్తూ ఏఐ ద్వారా ఫోటోలు డిజైన్‌ చేయగా.. మరొ కొందరు అభిమానులు 18000 నోట్‌బుక్‌లను ఉపయోగించి కేటీఆర్‌ బొమ్మను తయారు చేయడం సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే కేటీఆర్‌ తన పుట్టిన రోజు సందర్భంగా ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈరోజు జూలై 24న 47వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రొటీన్ కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడమే కాకుండా ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

Read also: WI vs IND: హైదరాబాద్ పేసర్ జోరు.. రెండో టెస్టులో విజయం దిశగా భారత్!

తన పుట్టినరోజున పేద పిల్లలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. 10, 12వ తరగతి విద్యార్థులకు రెండేళ్లపాటు ల్యాప్‌టాప్, కోచింగ్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలోని స్టేట్‌హోమ్‌లోని అనాథలను ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు 10, 12 తరగతుల్లో ప్రతిభ కనబరిచిన 47 మంది, ప్రొఫెషనల్ కోర్సులకు చెందిన మరో 47 మంది చిన్నారులను వ్యక్తిగతంగా ఆదుకుంటారు. ఈ విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ట్విట్టర్ వేదికగా ప్రతిజ్ఞ చేశారు. రెండేళ్లపాటు కోచింగ్‌ ఇస్తారు. కేటీఆర్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన్ను నాయకుడని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Read also: Astrology: జూలై 24, సోమవారం దినఫలాలు

కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా టీఎస్ టీఎస్ చైర్మన్ జగన్మోహన్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం కూకట్‌పల్లిలోని ఆయన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. కేటీఆర్ బొమ్మను చిత్రీకరించడానికి 18000 నోట్‌బుక్‌లను ఉపయోగించారు. జగన్మోహన్ మరియు అతని బృందం సభ్యులు మొజాయిక్ కళను చిత్రించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్‌ఎస్ మండల యువజన నాయకులు ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాల్లో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రోగులకు పండ్లు అందజేశారు.

Gyanvapi Mosque: నేటి నుంచి జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే