Site icon NTV Telugu

KTR: తెలంగాణ యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా

Ktr Hyderabad

Ktr Hyderabad

Telangana is the youngest state in India: తెలంగాణ యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో జరుగుతున్న వెజ్‌ ఆయిల్‌, ఆయిల్‌ సీడ్‌ రంగంపై గ్లోబల్‌ రౌండ్ టేబుల్‌ సదస్సుకు మంత్రి మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి మలేషియా, థాయిలాండ్ నుండి డెలిగేట్స్ వచ్చారు ఇక్కడ ప్రదేశాలు చూడండి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నానని అన్నారు. ఎనిమిదేళ్లలో ఎంతో పురోగతి సాధించామని గుర్తు చేశారు. ఇక్కడ నుండే 9 బిలియన్ డోస్ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసాము ప్రపంచానికి వ్యాక్సిన్ అందించామని తెలిపారు. హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యాక్సిన్ సిటీ హబ్ గా హైదరాబాద్ అవతరించిందని పేర్కొన్నారు. సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ గా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ ని ఎంచుకున్నాయని తెలిపారు.

Read also: MLC Kavitha: ఎంపీ అరవింద్ కు స్ట్రాంగ్ వార్నింగ్.. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సులభమైన పద్ధతులు అవలంబిస్తున్నామని అన్నారు. టీఎస్ ఐ పాస్ ద్వారా 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు మంత్రి. ఆయిల్ ఉత్పత్తిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, తెలంగాణలో మీకు అనుమతులు త్వరగా వస్తాయని కేటీఆర్‌ అన్నారు. మలేషియా థాయిలాండ్ నుండి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్నారు. తెలంగాణలో ఎనిమిదేళ్ళలో గ్రీన్ కవర్ 24 శాతం పెరిగిందని తెలిపారు. వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కేవలం నాలుగేళ్లలో పూర్తిచేసామని తెలిపారు. వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నమన్నారు. ఇక ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, ప్రాంతాల్లో పామాయిల్, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటల పరిశ్రమలకు అనుకూలని వ్యాక్యానించారు. వనపర్తి, గద్వాల్ ,నాగర్ కర్నూల్, నారాయణ్ పెట్ మహబూబ్ నగర్ గ్రౌండ్ నట్ కి అనుకూలమని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

Exit mobile version