Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేడు పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఉదయం ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రజలు సిద్ధమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని సీఎం, మంత్రులు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు.
Read also: Tamannaah : అలాంటి సీన్స్ లో నటిస్తే తప్పేంటి.. నటిగా అది నాకు అవసరం..
ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అందెశ్రీ స్వరపరిచిన తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సోనియా గాంధీ వీడియో సందేశాన్ని ప్లే చేస్తారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరంగా ఏం చేశారో ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగంలో వివరించనున్నారు. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటారు. స్టాళ్లను సందర్శిస్తారు.
Read also: Tamannaah : అలాంటి సీన్స్ లో నటిస్తే తప్పేంటి.. నటిగా అది నాకు అవసరం..
జూన్ 2న తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పర్యవేక్షిస్తున్నారు.తెలంగాణ రాజధాని నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం. ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన చార్మినార్, ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, అమరజ్యోతి స్థూపం, బీఆర్ అంబేద్కర్ విగ్రహం, గోల్కొండ తదితర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక స్టాల్స్ మరియు కార్నివాల్ నిర్వహిస్తారు. మరోవైపు అన్ని చోట్లా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అవతరణ దినోత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు.
T20 World Cup 2024: రిషబ్ పంత్ ఫిఫ్టీ.. బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం!