Site icon NTV Telugu

Inter Exam Dates: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఇంటర్ విద్యా విధానంలో మార్పులు

Inter

Inter

Inter Exam Dates: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యా విధానంలో మార్పులతో పాటు పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్ , ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి.. అలాగే, ఇంటర్ సిలబస్ లోనూ మార్పులు చేసినట్లు ప్రకటించారు. 12 సంవత్సరాల తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బొటనీ, జువాలాజీలో సిలబస్ లో మార్పులు జరిగాయని ప్రకటించారు. హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్ సిలబస్ ఏప్రిల్ మొదటి వారంలో బుక్స్ అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడించారు.

Read Also: Elderly Man Beaten: అసలు వీడు.. మనిషా.. మృగమా… పెద్దమనిషని చూడకుండా…

అలాగే, కొత్త కోర్స్( HEC, CEC లాగానే) ACE కోర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ లో ఉన్నట్టు గానే మిగతా లాంగ్వేజెస్ లోనూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇకపై 80 మార్కులు ఎక్స్‌టర్నల్‌, 20 మార్కులు ఇంటర్నల్‌ మార్కులుగా ఉంటాయన్నారు. ల్యాబ్ ప్రాక్టికల్స్‌ ప్రతి సంవత్సరం 15 మార్కుల చొప్పున నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు.

Exit mobile version