Site icon NTV Telugu

తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల..

కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగానికి తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే తెలంగాణ ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా… తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఫస్ట్‌ ఇయర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ ఫలితాలు విడుదల చేసింది.

read also : రైతులకు పంట రుణాలు అందించడంపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌

మొత్తం ఉత్తీర్ణత సాధించిన వారిలో 176719 మంది విద్యార్థులు ఏ-గ్రేడ్‌ కాగా.. 104886 మంది బీ గ్రేడ్‌ లో ఉత్తీర్ణులు అయ్యారు. 61,887 మంది సి-గ్రేడ్‌ కాగా.. 108093 మంది విద్యార్థులు డి గ్రేడ్‌ తో ఉత్తీర్ణత సాధించారు. ఇక ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,28,754 మంది బాలికలు కాగా.. 2,22,831 మంది బాలురు ఉన్నారని మంత్రి సబితా చెప్పారు.

Exit mobile version