TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
- మెమోల ప్రింటింగ్ పూర్తి
- 25 సెక్యూరిటీ ఫీచర్లు
- కాలేజీల్లోనే పంపిణీ
- ప్రిన్సిపాళ్లను సంప్రదించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Inter 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి మార్చి-2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, అలాగే మే-2026 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్ల (మెమోల) పంపిణీకి శ్రీకారం చుట్టింది. జనరల్ , ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థుల పాస్ సర్టిఫికెట్ల ముద్రణ ప్రక్రియను బోర్డు విజయవంతంగా పూర్తి చేసింది. ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ తమ కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి సర్టిఫికెట్లను స్వీకరించవచ్చని అధికారులు వెల్లడించారు.
25 ప్రత్యేక భద్రతా ఫీచర్లతో ప్రతి సర్టిఫికెట్
ఈసారి విద్యా మండలి పాస్ సర్టిఫికెట్ల ముద్రణలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలను పాటించింది. నకిలీ (డూప్లికేషన్) సర్టిఫికెట్ల తయారీకి లేదా ట్యాంపరింగ్‌కు ఎలాంటి అవకాశం లేకుండా ప్రతి పాస్ సర్టిఫికెట్లో 25 ప్రత్యేక భద్రతా ఫీచర్లను చేర్చారు. మార్కులు, వివరాల విశ్వసనీయతను, అసలుదనాన్ని కాపాడేందుకు బహుళస్థాయి భద్రతా చర్యలు చేపట్టినట్లు బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
Also Read
జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్ల ద్వారా పంపిణీ
ముద్రించిన సర్టిఫికెట్లను ఇప్పటికే జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులు , నోడల్ అధికారులకు అప్పగించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈ సర్టిఫికెట్లను సంబంధిత జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు చేరుస్తున్నారు. విద్యార్థులు నేరుగా తమ కాలేజీల వద్దకు వెళ్లి ఒరిజినల్ మెమోలను తీసుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. పరీక్షల్లో ప్రతిభ చాటి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఈ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది.
తాజావార్తలు
-
BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!