Site icon NTV Telugu

కళాశాలలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక…

కళాశాలలను తెలంగాణ ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ఈ కరోనా సమయంలో పర్మిషన్ లేకున్నా కొన్ని కళాశాలలు ఇంటర్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి. అనుమతి లేని బిల్డింగ్స్ లో కళాశాలలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫీజులు ఇస్టమొచ్చినట్టు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ కళాశాలలు అడ్మిషన్స్, ఫీ విషయం లో బోర్డ్ ఆదేశాలను పాటించాలి అని తెలిపింది. పిజికల్ తరగతులు నిర్వహించకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు ఉంటాయి. అలాగే అనుబంధ గుర్తింపు రద్దు చేస్తాం అని పేర్కొంది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది ఇంటర్ బోర్డు.

Exit mobile version