Site icon NTV Telugu

Telangana: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల ఛాయిస్‌ను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచింది. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే ఛాయిస్‌ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచి, ఛాయిస్‌గా వదిలేసుకొనే అవకాశం కల్పించింది. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్‌ బోర్డు అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టారు.

గత ఏడాది మూడు సెక్షన్లకు రెండింటిలో మాత్రమే 50 శాతం ఛాయిస్‌ ప్రశ్నలు ఇవ్వగా.. ఇప్పుడు మూడు సెక్షన్లలో ఛాయిస్‌ ప్రశ్నలు ఇచ్చారు. ప్రస్తుతం ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయకుండానే పాసయ్యారు. పైగా గతేడాది నిర్వహించిన పరీక్షల్లో చాలా మంది ఫెయిల్‌ కావడంతో ఛాయిస్‌ ప్రశ్నలు పెంచి మోడల్‌ ప్రశ్నపత్రాలను ఇంటర్ అధికారులు సిద్ధం చేశారు.

Exit mobile version