Site icon NTV Telugu

High Court: ప్రభుత్వ భూముల విక్రయానికి గ్రీన్‌ సిగ్నల్‌

ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించింది తెలంగాణ సర్కార్.. భూముల వేలం ద్వారా వేల కోట్లు ప్రభుత్వ ఖాజానాకు చేరాయి.. అయితే, ఈ మధ్యే కోకాపేట, ఖానామెట్‌లో జరిగిన భూముల వేలంపై భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి హైకోర్టును ఆశ్రయించారు.. విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వ భూముల విక్రయానికి పచ్చజెండా చూపింది… ప్రభుత్వం తన భూములను విక్రయించడాన్ని తప్పుపట్టలేమంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది హైకోర్టు.. భూముల విక్రయంలో ప్రభుత్వం టెండర్లు, ఈ వేలం వంటి పారదర్శక విధానాలు పాటించాలని సూచించింది.. ఇక, కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలం విషయంలో విజయశాంతి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగించింది హైకోర్టు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట దక్కింది.

Read Also: Gautam Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్‌ పదవిలో ట్విస్ట్..!

Exit mobile version