NTV Telugu Site icon

TS Group-1 Exam: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు..

Telangana High Cort

Telangana High Cort

TS Group-1 Exam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై టీఎస్ హైకోర్టు విచారణ చేపట్టింది. జూన్ 11న జరిగిన పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని కోర్టు ఆదేశించింది. తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.. TSPSC గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష లీకేజీ కారణాల వల్ల ఇప్పటికే ఒకసారి రద్దు చేయబడి, జూన్ 11న మరోసారి నిర్వహించబడింది. ఇప్పుడు రద్దు చేయడం ఇది రెండోసారి.

Read also: Mansion 24: ఆసక్తి రేపుతున్న అవికా గొర్ పోస్టర్..

అయితే గ్రూప్-1 రద్దు చేయాలని కోరుతూ జూన్‌లో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని ఆదిలాబాద్‌కు చెందిన బి.ప్రశాంత్‌ మరో ఇద్దరు అభ్యర్థులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా.. అభ్యర్థుల బయోమెట్రిక్, హాల్ టికెట్ నంబర్, ఫొటో తీసుకోకుండానే ఓమార్ షీట్ ఇచ్చారని ముగ్గురు అభ్యర్థులు పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ఈ నెల 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మంది హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది. లీకేజీ సమస్య కారణంగా టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలను కఠినంగా అమలు చేశారు. గతంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోగా ఈసారి చేయలేదు.
Financial Rules: ఆక్టోబర్ 1నుంచి మారనున్న రూల్స్ ఇవే