Site icon NTV Telugu

Weather Updates : సిద్ధంగా ఉండండి.. ఐదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలంట..!

Tg Rains

Tg Rains

SLBC : రాబోయే ఐదు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే నేడు, రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

IND vs ENG 4th Test: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ!

బంగాళాఖాతంలో ఈ నెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం మరింత పెరిగి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

హైదరాబాద్‌లో కూడా వర్షాలు మళ్ళీ తీవ్రంగా కురిసే అవకాశం ఉందని సూచనలున్నాయి. నేడు మరియు రేపు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. రోడ్లపై నీటిమునిగే పరిస్థితులు, ట్రాఫిక్ అంతరాయం వంటి సమస్యలకు నగరవాసులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

CM MK Stalin: ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్.. కొనసాగుతున్న చికిత్స..!

Exit mobile version