Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Khammam Telangana Health Director G Srinivas Rao Again Makes Controversial Comments At Iftar Party In Khammam

Health director srinivasrao: అంతా తాబీజ్‌ మహిమ.. అలా అనేసారేంటి..

Published Date :April 18, 2023 , 10:27 am
By NTV WebDesk
Health director srinivasrao: అంతా తాబీజ్‌ మహిమ.. అలా అనేసారేంటి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Health director srinivasrao: ప్రభుత్వ అధికారి ఏది మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. అయితే ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మరిచిపోతున్నారా? ఏ మీటింగ్ లో పాల్గొన్నా ఆయన మాటలు హాట్ టాపిక్‌ గా మారుతున్నాయి. తాజాగా ఆయన మాట్లాడిన మాటలు మరోసారి చిక్కుల్లో పడేశాయి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఆయన మరోసారి అలాంటి పనే చేశారు. తాయత్తు వల్లే తాను బతికి ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అధికారిక హోదాలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వస్తున్నాయి.

ఖమ్మం జిల్లాలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న శ్రీనివాస్ రావు… ఆపై మైక్ అందుకున్నారు. చిన్నతనంలో తాయత్తు వల్లే తాను బతికి ఉన్నానని, ఈస్థాయికి వచ్చానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేస్తూ… ఇఫ్తార్ విందులో చాలా సంతోషంగా కనిపించారు. కాగా ఆయన మూఢనమ్మకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని హేతువాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ డైరెక్టర్ హోదాలో ఉంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా? అని హేతువాదులు మండిపడుతున్నారు. అంతేకాకుండా.. శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌లో పొలిటికల్ ఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలు.. ప్రజా సేవే నిజమైన రాజకీయం అని తెలిపారు. కేసీఆర్, కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెంలో పోటీ చేస్తానన్నారు.

శ్రీనివాస్ రావు గతంలో కూడా కరోనా విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. గతేడాది డిసెంబర్‌లో కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందని అన్నారు. మనం చేసిన సేవల వల్ల కరోనా తగ్గలేదని… ఏసు ప్రభువు దయ వల్లనే కరోనా తగ్గుముఖం పట్టిందని అన్నారు. మన దేశానికి ఆధునిక వైద్యం, విద్యను తీసుకొచ్చింది క్రైస్తవులేనని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు ఆయనపై మండిపడ్డారు. ఒక హెల్త్ డైరెక్టర్ అయివుండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అంతా తాబీజ్‌ మహిమ అంటూ మాట్లాడిన మాటలు దుమారం రేపుతున్నాయి.
Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • controversial comments
  • Health Director Srinivasa Rao
  • Iftar Party
  • khammam
  • Telangana Health Director G Srinivas Rao

తాజావార్తలు

  • Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions