Site icon NTV Telugu

Telangana : వైద్య ఆరోగ్య శాఖలో భారీగా నియామకాలు.. మొత్తం 2,363 పోస్టులకు ఆమోదం

Telangana Govt

Telangana Govt

Telangana : తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ సేవలు మెరుగుపరచడం, ప్రభుత్వం నడిపే ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతను తీర్చడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

WAR2 : ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్

ఈ ఆమోదంతో వైద్య విధాన పరిషత్‌లో మొత్తం 2,363 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 944 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో, 87 పోస్టులను మినిమం టైమ్ స్కేల్‌ విధానంలో, మరో 1,332 పోస్టులను ఔట్ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముంది.

UK: ఓ పార్టీలో కలిసి పాడిన విజయ్ మాల్యా, లలిత్ మోడీ.. వీడియో వైరల్

ఈ నియామకాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత పెరగనుండగా, పల్లెప్రాంతాల్లోనూ వైద్యం అందుబాటులోకి రావడానికి ఇది దోహదపడనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ నియామకాలు ఆ దిశగా వేయబోయే అడుగులని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల అవసరాలకు తగినట్టు తగినంత మంది డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడం ప్రభుత్వ విధానానికి అద్దంపడుతోంది.

Exit mobile version