NTV Telugu Site icon

Telangana Police: పోలీసులకు సేవా పతకాలు.. గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌‌కు శౌర్య పతకం

Telangana Police

Telangana Police

Telangana Police: విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు తెలంగాణ సర్కార్ సేవా పతకాలను ప్రకటించింది. పోలీస్ శాఖలోని అగ్నిమాపక శాఖ, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి అన్ని విభాగాల్లో మొత్తం 636 మంది సిబ్బందికి ప్రభుత్వం ఈ పతకాలను ప్రకటించింది. వాటిలో 7 శౌర్య పతకాలు, 9 అత్యుత్తమ సేవా పతకాలు, 89 ఉత్తమ సేవా పతకాలు, 42 హార్డ్ సర్వీస్ మెడల్స్, 435 సేవా పతకాలు ప్రకటించారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకటించిన ఈ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్ర గ్యాలంట్రీ మెడల్‌కు కే ఉపేందర్ (జేసీ 4528 గ్రేహౌండ్స్) ఎంపికయ్యారు. మంద నవీన్ (సబ్-ఇన్‌స్పెక్టర్-రాచకొండ), వేలేటి మనోహర్ రావు (సబ్-ఇన్‌స్పెక్టర్-రాచకొండ), ఎం షడ్రక్ (సిట్-హైదరాబాద్), గజాడి మల్లేశం (అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్-సైబరాబాద్) మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకానికి సయ్యద్ నయీముద్దీన్ జావీద్ (ఏసీపీ రోడ్ సేఫ్టీ-రాచకొండ), జి.రణవీర్ రెడ్డి(ఏసీపీ-మాదాపూర్ ట్రాఫిక్), ఎస్.శ్రీనివాసులు(ఏసీపీ-బాలానగర్ ట్రాఫిక్) ఎంపికయ్యారు.

Read also: Asaduddin Owaisi: రామమందిరంపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..

ఇలా విభాగాల వారీగా..

* అవినీతి నిరోధక శాఖలో ఐదుగురికి ఉత్తమ సేవ, ముగ్గురికి సేవా పతకాలు
* విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో మూడు మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్
* విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఏడుగురికి సేవా పతకాలు
* డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మరియు ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో ఆరుగురికి గ్యాలంటరీ పతకాలు
* విపత్తు నిర్వహణ మరియు అగ్నిమాపక విభాగంలో ముగ్గురికి ఉత్తమ సేవా పతకాలు
* విపత్తు నిర్వహణ మరియు అగ్నిమాపక విభాగంలో 13 మందికి సేవా పతకాలు.
* గ్రేహౌండ్స్‌కు చెందిన కానిస్టేబుల్ ఉపేందర్‌కు శౌర్య పతకం లభించింది
* పోలీసు శాఖలో 9 మందికి సేవా పతకాలు
* TSSPF ఒకరికి విశిష్ట సేవా పతకాన్ని, నలుగురికి ఉత్తమ సేవా పతకాన్ని అందించింది.
Raj Kumar Hirani: రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఉంది కానీ…