Site icon NTV Telugu

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీఆర్‌ఎస్‌కు ఆమోదం..

RS Praveen Kumar

RS Praveen Kumar

సీనియర్‌ ఐపీఎస్, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌)కు ఆమోదం తెలిపింది రాష్ట్ర సర్కార్‌.. ఆయన చేసుకున్న వీఆర్ఎస్‌ ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించిన ప్రభుత్వం విధుల నుంచి రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది… కాగా, 26 ఏళ్ల సర్వీస్‌ పూర్తిచేసిన ఈ ఐపీఎస్‌… ప్రస్తుతం అడిషనల్‌ డీజీ ర్యాంక్‌లో ఉన్నారు. ఇంకా ఆరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. ఇంకా స్వేచ్ఛగా ప్రజలకు సేవ చేయడానికే ఈ నిర్ణయం అన్నారు.. ఉద్యోగంలో ఉంటే కొన్ని పరిమితులు ఉంటాయి.. ఎలాంటి పరిమితులు లేకుండా సేవ చేస్తానన్నారు.. ఇక, ఆయన రాజకీయ ప్రవేశంపై ప్రచారం జరుగుతుండగా.. ఇప్పటికి అలాంటి నిర్ణయం ఏమీ తీసేకోలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. మరోవైపు.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ రాజీనామాతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యద‌ర్శిగా ఆర్థిక‌శాఖ ప్రత్యేక కార్యద‌ర్శి రొనాల్డ్ రోస్‌కు ప్రభుత్వం అద‌న‌పు బాధ్యత‌లు అప్పజెప్పింది.

Exit mobile version