Site icon NTV Telugu

రేపు నల్గొండలో గవర్నర్‌ తమిళిసై పర్యటన

Governor Tamilisai

Governor Tamilisai

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.. నల్గొండ పట్టణంలోని సింధూర హాస్పిటల్ లో కిడ్నీ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు గవర్నర్‌.. ఆ తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో 2వ అంతస్తులో సెమినార్ హాల్‌ను ప్రారభించనున్నారు.. ఇక, అనంతరం పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆమె.. మొక్కలు నాటే కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు.. తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని.. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంభిస్తారు.. అనంతరం హైదరాబాద్ కి తిరుగుప్రయాణం కానున్నారు గవర్నర్‌ తమిళిసై.

Exit mobile version