Site icon NTV Telugu

వచ్చే నెలలోనే తెలంగాణ ఇంటర్ పరీక్షలు !

తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కరోనా కేసులు.. గత వారం రోజులుగా 3 వేలు మించడం లేదు. ఈ నేపథ్యంలో.. జూన్‌ నెలాఖరులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని కెసిఆర్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. అవకాశం ఉంటే జూన్‌ నెలాఖరులో పరీక్షలు జరుపుతామని, లేని పక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకుంటున్నామని ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా వారికి చెప్పినట్లు సమాచారం. రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు లేకుంటే ప్రథమ సంవత్సరం పరీక్షల్లో మార్కుల ఆధారంగా ఇవ్వడం లాంటి వాటిని పరిశీలిస్తున్నామని వివరించినట్లు సమాచారం. ఈ ప్రత్యామ్నాయ మార్గాలపై ఇంటర్‌బోర్డు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించిన ప్రభుత్వం జూన్‌ 1న సమీక్షించి అప్పటి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Exit mobile version