Site icon NTV Telugu

Telangna Jobs : మొదటి విడతలో 30,453 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌..

Telangana Finance Department Green Signal to Recruit 30,453 Jobs.

తెలంగాణ ఆర్థిక శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇటీవల సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాల్లో 80,039 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీంతో ప్రసుత్తం మొదటి విడుత కొలువుల జాతర ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా ఆయా శాఖల్లోని ఖాళీలను బట్టి వేరువేరు నియామక సంస్థల ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా 30,453 పోస్టలు భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. అంతేకాకుండా శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. 80,039 ఉద్యోగాలకు గాను తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఇవాళ ఆర్థిక శాఖ పచ్చా జెండా ఊపింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే సమావేశం నిర్వహించనున్నారు.

Exit mobile version