NTV Telugu Site icon

Sewing Machines: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్లు!.. ఇలా అప్లై చేసుకోండి!

Sewing Machine

Sewing Machine

మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలను తీసుకొస్తుంది. ఉపాధి కల్పించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ కుట్టుమిషన్లు అన్ని వర్గాల మహిళలకు కాదండోయ్. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనారిటీ వర్గాలకు చెందిన, అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను ప్రభుత్వం అందించనున్నది. అర్హులైన వారు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఉచిత కుట్టు మిషన్ల కోసం అప్లై చేసుకునేందుకు ముందుగా https://tgobmms.cgg.gov.in సైట్ ను సందర్శించాలి. సైట్ ఓపెన్ కాగానే Apply Online for availing the Sewing Machines under ” Indiramma Mahila Shakti ” scheme (Christian Minority – 2024-25) కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే డైరెక్టుగా దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు వ్యక్తిగత వివరాలు, అడ్రెస్ వివరాలు, ఎటాచ్‌మెంట్స్ విభాగాలను నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రివ్యూ చూసి.. సబ్‌మిట్ క్లిక్ చేస్తే చాలు.. ఫారమ్ వెళ్లిపోయి.. మీకు ఒక ఎక్నాలెడ్జ్‌మెంట్ వస్తుంది.

అందులో ఉండే ఐడీ నంబర్ ద్వారా.. మీ ఫారమ్ స్టేటస్‌ని కూడా తర్వాత తెలుసుకోవచ్చు. ఈ ఫారమ్‌లో పేరు, రేషన్ కార్డు నంబర్, తండ్రి పేరు, సంవత్సర ఆదాయం, పెళ్లి వివరాలు, మొబైల్ నంబర్, మతం, టైలరింగ్ ట్రైనింగ్ వివరాలు, ఆధార్ నంబర్, పుట్టిన రోజు, జెండర్, చదువు వివరాల వంటివి నింపాల్సి ఉంటుంది. అలాగే.. అడ్రెస్ వివరాలను నింపి, కింద ఒక ఫొటోగ్రాఫ్, కుల ధ్రువీకరణ పత్రం, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్‌ని అప్‌లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ కుట్టుమిషన్లను ఆల్రెడీ కుట్టుపనిలో ట్రైనింగ్ పొందిన ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైనులు, పార్సీ మతాలకు చెందిన మహిళలకు మాత్రమే ఇస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

అర్హతలు ఇవే:

మహిళ కనీసం 5వ తరగతి పాసై ఉండాలి.
బాప్టిజం, బీసీ సీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
కుట్టుపనిలో ఆల్రెడీ ట్రైనింగ్ పొందిన సర్టిఫికెట్ ఉండాలి. TGCMFC అనుబంధంగా ఉన్న సంస్థల నుంచి శిక్షణ పొందిన వారు కూడా అర్హులే.
21 నుండి 55 సంవత్సరాల వయస్సు ఉండాలి.
తెల్ల రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉండాలి లేదా ఆదాయ దృవీకరణ పత్రం ఉండాలి. తప్పనిసరిగా నిరుద్యోగులు అయి ఉండాలి.
సంవత్సర ఆదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ ఉండాలి.