మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల నియామకాలకు సిద్ధం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం.. ఆ పోస్టులకు సంబంధించిన అర్హతకు సంబంధించి మార్గదర్శకాలను పేర్కొంది ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్… పురపాలక సంఘాల పరిధిలోని సబ్ సెంటర్లలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది… ఆ పోస్టులకు ఎంబీబీఎస్ / బీఏఎంఎస్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది.. అందులోనూ ఎంబీబీఎస్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.. ఇక, స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం బీఎస్సీ నర్సింగ్ 2020 తర్వాత పూర్తి చేసిన వారు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎం పూర్తి చేసి ఆరు నెలల కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్టు (సీపీసీహెచ్) పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొంది.. ఆయా ఆస్పత్రుల్లో నియమితులైన డాక్టర్లకు రూ.40 వేల గౌరవ వేతనం అందించనున్నారు.. ఇక, స్టాఫ్ నర్స్‌లకైతే రూ.29,900 చొప్పున గౌరవ వేతనం పొందుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.
Read Also: BJP MLA Raja Singh: ధర్మం కన్నా పార్టీ ముఖ్యం కాదు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..