NTV Telugu Site icon

Telangana: పంచాయతీ కార్మికులకు గుడ్‌న్యూస్.. బీమా సౌకర్యం కల్పించాలని సర్కార్‌ నిర్ణయం

Panchayat Workers

Panchayat Workers

Telangana: తెలంగాణ సర్కార్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుధ్య కార్మికులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పారిశుధ్య కార్మికులు మరణిస్తే వారి అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీల్లో పనిచేస్తూ మరణించిన బహుళార్థసాధక కార్మికులు (ఎంపీడబ్ల్యూ) కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.

Read also: Samantha : స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న సమంత..

ఈ బీమా సౌకర్యాన్ని ఎల్‌ఐసీ అందజేస్తుంది. కార్మికుల బీమా పాలసీ మొత్తాన్ని సంబంధిత గ్రామపంచాయతీ చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి పారిశుధ్య కార్మికునికి ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్వీసులో ఉన్న కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే సర్వీసులో ఉన్న కార్మికులు మరణిస్తే దహన సంస్కారాలకు ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచారు. ఇప్పటి వరకు తమకు రూ. 5వేలు ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ. 10 వేలు. ఈ మొత్తాన్ని చెల్లించాలని సంబంధిత గ్రామ పంచాయతీని ఆదేశించింది. ఈ నిర్ణయాల అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న పంచాయతీ కార్మికులు తాజాగా విధుల్లో చేరారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బీమా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Rice Water Health Benefits: గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇక వదలరు..