TS Government: జేపీఎస్ లకు లాస్ట్ ఛాన్స్.. మధ్యాహ్నం 12 వరకు రాకపోతే లిస్ట్ లో లేనట్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana government gave JPS employees a last chance: సమ్మె చేస్తున్న జేపీఎస్ లకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సమ్మె విరమించి ఇవాల మధ్నాహ్నం 12 లోపు విధులకు హాజరు కాకుంటే తమ పేర్లను లిస్ట్ లేనట్టే అని హెచ్చరించింది. సమ్మె చేస్తున్న పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీలను చర్చలకు పిలిచేది లేదని తేల్చి చెప్పింది. ఇవాల మధ్యాహ్నం 12 గంటల లోపు డ్యూటీలో ఉన్నవారి లిస్ట్ పంపించాలని అధికారులకు ఆదేశించింది. డ్యూటీలో లేనివారు ఉద్యోగులు కారంటూ ప్రకటించింది. 12 గంటల లోపు డ్యూటీలో లేని వారిని గుర్తించి, ఆయా గ్రామాలను గుర్తించి.. లిస్ట్ డిపిఓలకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
గ్రామ పంచాయతీలలో గ్రామ సభ పెట్టి డిగ్రీ చదివిన వారిని తాత్కాలికంగా పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీ లుగా నియామకం చేయాలని వెల్లడించింది. గతంలో పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, లేదా రిజర్వేషన్ ప్రాతిపదికన నియమించాలని సూచించింది. సమ్మె విరమించి వస్తే డ్యూటీలో జాయిన్ కావచ్చని పేర్కొంది. లేదంటే ఇప్పటికి వారి టర్మ్ ముగిసింది కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ప్రభుత్వంతో సంబంధం లేదని పేర్కొంది. పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో టర్మీనెట్ చేయాల్సిన అవసరం లేదని వివరించింది. అయితే జేపీఎస్ లకు లాస్ట్ గా ఒక్క ఛాన్స్ ప్రభుత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి జేపీఎస్ లు మధ్యాహ్నం 12 లోపు విధులకు హాజరవుతారా? సమ్మె కొనసాగిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్‌లో ఏముంది?
Read also: Venugopala Krishna: ప్యాకేజీ కోసమే పొత్తులు…. పవన్ ని నమ్మితే అంతే
ఇక తాజాగా ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలిచినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా జరుగుతుందని. సమ్మెను వెంటనే విరమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. తాను గానీ, మరెవరూ ప్రభుత్వం తరఫున జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఇలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుందన్నారు. ఆ పేరు పోగొట్టుకోవద్దని సూచించారు. లిఖిత పూర్వక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న తీరు బాగోలేదని.. అంతేకానీ సోషల్ మీడియాలో ప్రచారాన్ని తక్షణం ఆపాలని ఎర్రబెల్లి కోరిన విషయం తెలిసిందే..
Pralhad Joshi : బీజేపీ గెలవాలని కాలినడకన తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్న కేంద్ర మంత్రి
తాజావార్తలు
-
Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్‌లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!