NTV Telugu Site icon

TS Government: జేపీఎస్ లకు లాస్ట్ ఛాన్స్.. మధ్యాహ్నం 12 వరకు రాకపోతే లిస్ట్ లో లేనట్టే

Jps

Jps

Telangana government gave JPS employees a last chance: సమ్మె చేస్తున్న జేపీఎస్ లకు ప్రభుత్వం సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. సమ్మె విరమించి ఇవాల మధ్నాహ్నం 12 లోపు విధులకు హాజరు కాకుంటే తమ పేర్లను లిస్ట్‌ లేనట్టే అని హెచ్చరించింది. సమ్మె చేస్తున్న పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీలను చర్చలకు పిలిచేది లేదని తేల్చి చెప్పింది. ఇవాల మధ్యాహ్నం 12 గంటల లోపు డ్యూటీలో ఉన్నవారి లిస్ట్ పంపించాలని అధికారులకు ఆదేశించింది. డ్యూటీలో లేనివారు ఉద్యోగులు కారంటూ ప్రకటించింది. 12 గంటల లోపు డ్యూటీలో లేని వారిని గుర్తించి, ఆయా గ్రామాలను గుర్తించి.. లిస్ట్ డిపిఓలకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.

గ్రామ పంచాయతీలలో గ్రామ సభ పెట్టి డిగ్రీ చదివిన వారిని తాత్కాలికంగా పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీ లుగా నియామకం చేయాలని వెల్లడించింది. గతంలో పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, లేదా రిజర్వేషన్ ప్రాతిపదికన నియమించాలని సూచించింది. సమ్మె విరమించి వస్తే డ్యూటీలో జాయిన్ కావచ్చని పేర్కొంది. లేదంటే ఇప్పటికి వారి టర్మ్ ముగిసింది కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ వారికి ప్రభుత్వంతో సంబంధం లేదని పేర్కొంది. పంచాయతీ రాజ్ జూనియర్ సెక్రటరీల విషయంలో టర్మీనెట్ చేయాల్సిన అవసరం లేదని వివరించింది. అయితే జేపీఎస్ లకు లాస్ట్ గా ఒక్క ఛాన్స్ ప్రభుత్వం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి జేపీఎస్ లు మధ్యాహ్నం 12 లోపు విధులకు హాజరవుతారా? సమ్మె కొనసాగిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Read also: Venugopala Krishna: ప్యాకేజీ కోసమే పొత్తులు…. పవన్ ని నమ్మితే అంతే

ఇక తాజాగా ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలిచినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా జరుగుతుందని. సమ్మెను వెంటనే విరమించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. తాను గానీ, మరెవరూ ప్రభుత్వం తరఫున జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిచిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఇలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తే బాగుంటుందన్నారు. ఆ పేరు పోగొట్టుకోవద్దని సూచించారు. లిఖిత పూర్వక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న తీరు బాగోలేదని.. అంతేకానీ సోషల్ మీడియాలో ప్రచారాన్ని తక్షణం ఆపాలని ఎర్రబెల్లి కోరిన విషయం తెలిసిందే..
Pralhad Joshi : బీజేపీ గెలవాలని కాలినడకన తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్న కేంద్ర మంత్రి

Show comments