NTV Telugu Site icon

Singareni Workers: సింగరేణి కార్మికులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్షల్లో జమ..

Singareni Cmkcr Good News

Singareni Cmkcr Good News

Singareni Workers: సింగరేణి కార్మికులకు శుభవార్త. 11వ వేజ్ బోర్డు బకాయిలు రూ.1450 కోట్లు సింగరేణి కార్మికుల ఖాతాల్లో జమ కావడంతో కార్మికుల కళ్లలో ఆనందం నింగికి ఎగిసింది. తెలంగాణ సర్కార్ చెప్పినట్టే వారి ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో సింగరేణి కార్మికుల్లో పండుగవాతావరణం నెలకొంది. గురువారం సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరాం నిర్ణయం తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తం ఒకేసారి చెల్లించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు. ఆదాయపు పన్ను, సీఎంపీఎఫ్‌లో జమ చేయాల్సిన మొత్తం మినహా మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేశారు. అంతేకాదు, త్వరలో దసరా పండుగలోపు లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్‌ను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్ ను దసరా లోపు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామని బలరాం ప్రకటించారు. దీపావళి బోనస్ పీఎల్ ఆర్ ముందుగానే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని.. బకాయిలు, బోనస్ చెల్లింపులపై కొందరు అనవసర అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని కార్మికులు నమ్మవద్దని కోరారు. బకాయిలు, బోనస్‌ల చెల్లింపునకు ఎవరూ అడగకముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పెద్దమొత్తంలో బకాయిలు పొందిన కార్మికులు ఈ సొమ్మును పొదుపుగా వినియోగించి తమ కుటుంబాల భవిష్యత్తుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read also: Telangana Govt: రుణమాఫీకి మరో వెయ్యి కోట్లు.. రూ.1.20 లక్షల రుణాలున్న రైతుల ఖాతాల్లో జమ

సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతుందని, ఉద్యోగులు కూడా తమ పనివేళలను సద్వినియోగం చేసుకుని సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. వారు కూడా మరిన్ని ప్రయోజనాలు, సంక్షేమం పొందాలని కోరారు. ఈ వేతన బకాయిలు పొందిన వారిలో రామగుండం-1 ఏరియా హెడ్ ఓవర్‌మెన్ వేముల సుదర్శన్ రెడ్డి సింగరేణి టాపర్‌గా నిలిచారు. 9.91 లక్షలు మొదటి స్థానంలో ఉంది. రామగుండం-2 ప్రాంతానికి చెందిన ఈఐపీ ఆపరేటర్ మీర్జా ఉస్మాన్ బేగ్ రెండో స్థానంలో రూ. 9.35 లక్షలు, మూడో స్థానంలో రూ. 9.16 లక్షలతో శ్రీరాంపూర్ ఏరియా హెడ్ ఓవర్‌మెన్ ఆడెపు రాజమల్లు. సింగరేణి భవన్‌లో అత్యధిక బకాయిలు పొందిన లచ్చయ్య (రూ. 6.97 లక్షలు), రవిబాబు (రూ. 6.81 లక్షలు), సత్యనారాయణరెడ్డి (రూ. 6.69 లక్షలు)లకు డైరెక్టర్ బలరాం, జిఎం సురేష్ చెక్కులను అందించారు. బకాయిలు అందడమే కాకుండా.. దసరా పండుగలోపు లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్ కూడా ఇస్తామని చెప్పడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కో కూలీకి లక్షల్లో డబ్బులు జమ కావడం సంతోషంగా ఉందని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Ambati Rambabu: బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో.. బాలయ్య మీకు ఇదే సరైన సమయం..!