Increase Ration: తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డీలర్ల కమీషన్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం డీలర్ల నుంచి రూ. 70 కమీషన్ ఇస్తుండగా.. ఆ రెట్టింపు చేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. అంటే ఇక నుంచి రూ. 140 కమీషన్ గా ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయంలో రేషన్ డీలర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు, గుంగుల కమలాకర్, పలువురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడంతో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, కరోనా కష్టకాలంలో ప్రాణాలు కోల్పోయిన రేషన్ డీలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇవ్వాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read also: Devara : ఆ పక్కా యాక్షన్ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుందా..?
డీలర్ మరణిస్తే, కారుణ్య రిక్రూట్‌మెంట్ ద్వారా రేషన్ డీలర్లను ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పించారు. దీని ప్రకారం డీలర్ మరణిస్తే కారుణ్య నియామకం ద్వారా అతని కుటుంబంలో ఒకరికి డీలర్ షిప్ ఇచ్చేందుకు అర్హత వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 40 ఏళ్ల వరకు ఉన్న డీలర్‌షిప్‌కు అర్హత వయోపరిమితిని మరో పదేళ్లు అంటే 50 ఏళ్లు పెంచుతూ పౌరసరఫరాల శాఖ జూన్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిబంధనతో సంబంధం లేకుండా డీలర్ మరణించిన రెండేళ్లకు డీలర్ షిప్ కేటాయిస్తారు. కానీ డీలర్ మరణించిన వెంటనే అర్హత ఉన్న వ్యక్తి డీలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. అంతేకాదు..రేషన్ డీలర్ షిప్ పొందే వ్యక్తికి 18 ఏళ్లు నిండి ఉండాలనేది తప్పనిసరి నిబంధన. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
Guntur Kaaram: మహేష్ బర్త్ డే గిఫ్ట్ లేనట్టే.. ఇక ఆశలు వదిలేయడమే
