Site icon NTV Telugu

కేఆర్ఎంబి పై తెలంగాణ సర్కార్ అసంతృప్తి !

KRMB AP

KRMB AP

కేఆర్ఎంబి అధికారుల వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదం అయ్యింది. ప్రాజెక్టుల పనుల పరిశీలన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై తెలంగాణ ఇరిగేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఫిర్యాదు ఆధారంగా ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాల తర్వాత చాలా ఆలస్యంగా కేఆర్‌ఎంబీ బృందం రాయలసీమ ఎత్తిపోతల పనులను పరిశీలించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కేఆర్ఎంబి చైర్మన్ కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. తాము ఫిర్యాదు దారులమైనందున తమ ప్రతినిధులను కూడా బృందం వెంట తీసుకెళ్లాలని బోర్డు ఛైర్మన్‌ను కోరామన్న రజత్‌ కుమార్‌.. తటస్థులు మాత్రమే వెళ్లాలన్న కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఛైర్మన్‌ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదన్నారు.

Read: పుష్ప : “దాక్కో దాక్కో మేక” సాంగ్ వచ్చేసింది !

ఈనెల 11న రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన సమయంలో కృష్ణా బోర్డు బృందంతో పాటు ఏపీ ఈఎన్సీ, సీఈలు ఉన్నారని, బృంద సభ్యులతో మాట్లాడటంతో పాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారని లేఖలో తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేఆర్‌ఎంబీ ఇచ్చే నివేదిక నిష్పాక్షికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ లేఖలో వెల్లడించారు. ఏపీ అధికారుల చర్యలు కృష్ణా బోర్డు బృందాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయని… లేఖ ప్రతులను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కార్యాలయం, కార్యదర్శికి కూడా రజత్‌ కుమార్‌ పంపినట్లు తెలిపారు.

Exit mobile version