Site icon NTV Telugu

Revanth Reddy Kit: ఎంసిహెచ్ పేరుతో కొత్త కిట్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

Revanth Reddy Kits

Revanth Reddy Kits

Revanth Reddy Kit: గత పదేళ్లుగా తెలంగాణలో సుపరిచితమైన పేరు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా కేసీఆర్ పేరుతో ఎన్నో పథకాలు అమలు చేయడంతో ఆ పేరు బాగా వినిపించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించిన కాంగ్రెస్.. రాష్ట్రంలో ఆయన పేరు కూడా వినిపించకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ పేరిట ఉన్న పథకాలను మారుస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాతా శిశు సంక్షేమం కోసం కేసీఆర్ కిట్‌ను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం జరిగితే తల్లికి, అప్పుడే పుట్టిన బిడ్డకు ఉపయోగపడే వస్తువులను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తూవచ్చింది. పేద మధ్యతరగతి తల్లులను ఆదుకోవాలనే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కేసీఆర్ కిట్ పేరు, ఫొటోపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా కేసీఆర్ కిట్ పేరు మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Read also: Raviteja: వాయిదా వేసుకోని మంచి పని చేసావ్ కానీ ఆ ఫిబ్రవరి మాత్రం వద్దు రవన్న…

ఇక నుంచి కేసీఆర్ కిట్ పేరును మాతా శిశు ఆరోగ్యం (ఎంసీహెచ్)గా మారుస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే కిట్ బ్యాగులపై కేసీఆర్ పేరు, ఫొటోలతో కూడిన ఎంసీహెచ్ స్టిక్కర్లు అతికించి పంపిణీ చేస్తున్నారు. ఇంత జరిగినా ఎంసీహెచ్ పేరుతో కొత్త కిట్లను అందించాలని ప్రభుత్వం ఆదేశించిందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నివాసం కాస్త ఉపముఖ్యమంత్రి నివాసంలా… ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ లా మారింది. అంతేకాదు ప్రతి వారం ప్రజావాణి నిర్వహించి సామాన్యులను అనుమతిస్తున్నారు. ఇలా కేసీఆర్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అనుమతి లేని భవనంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులను అనుమతిస్తోంది. పేదలకు సొంత భూమిలో ఇళ్ల నిర్మాణం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. గృహ లక్ష్మి ద్వారా అర్హులైన వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు ఆర్థిక సాయం అందించారు. అయితే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆరు హామీల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. పేదల ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సహాయం చేస్తుంది. అందుకే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేశామని రేవంత్ సర్కార్ చెబుతోంది.
IND vs SA: మార్‌క్రమ్‌ అద్భుతం.. కొన్నిసార్లు బౌలర్లపై ఎటాక్‌ చేయడమే సరైన నిర్ణయం: సచిన్

Exit mobile version