Site icon NTV Telugu

Telangana: తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం

Revanth Reddy

Revanth Reddy

Hyderabad: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రివర్గ కూర్పు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదివరకే కొన్ని హామీలు అమలు చేయగా, మరికొన్ని హామీల అమలుతో పాటు పాలనలో తమదైన మార్క్ చూపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు మంత్రులను ఇన్‌ఛార్జీలుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం అమలును సమీక్షించి, పర్యవేక్షించనున్నారు.

Also Read: Viral Video: డ్యాన్స్ చేస్తూ నడిరోడ్డుపై యువతి రచ్చ.. సజ్జనార్ రియాక్షన్ చూశారా?

తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

1.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – కరీంనగర్
2.దుద్దిళ్ల శ్రీధర్ బాబు – రంగారెడ్డి
3.పొన్నం ప్రభాకర్ – హైదరాబాద్
4.దామోదర రాజనరసింహ – మహబూబ్ నగర్
5.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – ఖమ్మం
6.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – వరంగల్
7.కొండా సురేఖ – మెదక్
8.అనసూయ సీతక్క – ఆదిలాబాద్
9.తుమ్మల నాగేశ్వర రావు – నల్గొండ
10.జూపాల్లి కృష్ణారావు – నిజామాబాద్

Exit mobile version