NTV Telugu Site icon

ప్ర‌భుత్వ ఉద్యోగుల ఇన్సూరెన్స్ పాల‌సీలో మార్పులు..

TS Government

ప్ర‌భుత్వ ఉద్యోగుల ఇన్సూరెన్స్ పాల‌సీలో కీల‌క మార్పులు చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం.. ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును ప్ర‌భుత్వం పెంచ‌డంతో ఇన్సూరెన్స్ పాల‌సీలో, ప్రీమియం స్లాబుల‌ను మారుస్తూ ఆర్థిక‌శాఖ ఆదేశాలు జారీ చేసింది.. ఇప్ప‌టి వ‌ర‌కు 53 ఏళ్ల వ‌ర‌కే ఇన్సూరెన్స్ అవ‌కాశం ఉండ‌గా.. ఇప్పుడూ ఆ వ‌య‌స్సును 56 ఏళ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది తెలంగాణ ప్ర‌భుత్వం.. ఇక‌, కనిష్ఠ బీమా వయసు 21 నుంచి 19 ఏళ్ల‌కు తగ్గించింది. కనిష్ఠ ప్రీమియం స్లాబును రూ. 500 నుంచి 750కి.. గరిష్ఠ ప్రీమియం స్లాబును రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కార్.