Site icon NTV Telugu

అభివృద్ధికే భూముల వేలం.. ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు-సర్కార్

Land Auction

Land Auction

కోకాపేట్, ఖానామెట్‌ భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది.. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి కనకవర్షమే కుసింది.. ఇదే సమయంలో.. వేలంపై ఆరోపణలు కూడా లేకపోలేదు.. గతంలో ఇతర రాష్ట్రాల కంపెనీలు పాల్గొన్నాయి.. ఈసారి ఎందుకు రాలేదంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.. అంతేకాదు.. భారీ స్కామ్‌ జరిగిందని ఆరోపణలు గుప్పించారు.. దీనిపై సీరియస్‌గా స్పందించింది తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్‌ నగర అభివృద్ధికే కోకాపేట్‌, ఖానామెట్‌ భూములు వేలం వేశామన్న సర్కార్.. ప్రభుత్వ భూముల వేలం ఇది కొత్తకాదు.. గతానికి ఇది కొనసాగింపే అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌ బిడ్‌ ద్వారా వేలం పారదర్శకంగా జరిగిందని పేర్కొన్న తెలంగాణ ప్రభుత్వం.. వీలైనంత ఎక్కువ మంది వేలంలో పాల్గొనేలా చేశామని.. 80 మంది ప్రతినిధులు ప్రీ బిడ్డింగ్‌ సమావేశానికి హాజరయ్యారు.. ఏ బిడ్డర్‌ ఏ ప్లాట్ కొన్నారన్నది బయటివారికి తెలియదు.. ఎవరైనా ఒక బిడ్‌ను ప్రభావితం చేస్తారనే అపోహలకు తావులేదని స్పష్టం చేసింది.. ఎక్కువ ధరకు కోట్‌ చేసి బిడ్డర్‌కే ప్లాట్‌ దక్కుతుంది.. కానీ, ఆరోపణలకు ఆస్కారమే లేదని పేర్కొంది. ఇక, ప్రభుత్వ రంగ సంస్థలకు భంగం కలిగే చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించిన సర్కార్.. ఆరోపణలపై న్యాయపరంగా పరువునష్టం చర్యలు తీసుకుంటామని ప్రకటనలో పేర్కొంది.

Exit mobile version