NTV Telugu Site icon

Hyderabad Girl: లండన్ లో తెలంగాణ యువతి మృతి.. కత్తితో దాడి చేసి చంపిన యువకుడు

Tejaswi

Tejaswi

Hyderabad Girl: తాజాగా టెక్సాక్ కాల్పుల్లో హైదరాబాద్ బాలిక తాటికొండ ఐశ్వర్య మృతి చెందిన ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. లండన్‌లో మరో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు ఆమెపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని చంపాపేట్‌కు చెందిన తేజస్విని చదువు కోసం లండన్‌ వెళ్లింది. అది స్నేహితులతో కలిసి ఉంటోంది. అయితే తేజస్విని, అఖిల అనే మరో విద్యార్థినిపై బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు దాడి చేశాడు. ఈ దాడిలో తేజస్విని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అఖిల నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది? దాడి చేసిన యువకుడు అఖిల గుర్తు పడుతుందా? తేజస్విని, అఖిల ఉంటుందన్న అపార్ట్ మెంట్ వద్దకు దాడి చేసిన యువకుడు ఎందుకు వెళ్లాడు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.

Read also: Pawan Kalyan Varahi Yatra: అన్నవరంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక పూజలు

ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? ఇద్దరు అమ్మాయిలపై ఎందుకు దాడి చేశాడు? పోలీసులు విచారిస్తున్నారు. తేజశ్విని మృతిపై లండన్‌లోని అధికారులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మరణవార్త విని తేజస్విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన మృతదేహాన్ని వారికి అప్పగించాలని వేడుకుంటున్నారు. తన కూతురిపై బ్రిజిల్ యువకుడు ఎందుకు దాడి చేశాడో? అసలు తను మా అమ్మాయికి ఎలా పరిచయమో తమకు తెలియదని అంటున్నారు. తేజస్వి చదువులో చురుకుగా ఉండేదని, అందుకే పై చదువులకు లండన్ పంపామని అన్నారు. లండ్ లో చదువుకుని మంచి ఉద్యోగం చేస్తుందని భావించామని కానీ.. ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేమని వాపోయారు. తేజస్వినిపై దాడి చేసిన యువకుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


Sreeleela Birthday: శ్రీలీల బర్త్ డే స్పెషల్.. ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల! మరీ ఇంత అందమా