ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరాఢంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా వేడుకలను సాదాసీదాగా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత బయటకు ఎవరూ రాకూడదు అనే సంగతి తెలిసిందే. దీంతో ఉదయం సమయంలోనే వేడుకలను సాదాసీదాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ వేడుకలు జరిగినా 10 మందికి మించకుండా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా కరోనా కారణంగా వేడుకలు నిరాఢంబరంగా నిర్వహించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
నిరాఢంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు … 10 మందికి మించకుండా…
