Site icon NTV Telugu

Ministry of Finance: బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ.. కొత్త మార్గదర్శకాలు..

బ్యాంక్ ఖాతాల నిర్వహణపై ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ ఆర్థిక శాఖ… ఇకపై కొత్త ఖాతా ఓపెన్ చేయాలి అంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది… ప్రతి నెల బ్యాంకు ఖాతాలను వెరిఫై చేయాలి.. డీటెయిల్స్‌ని 10వ తేదీలోపు ఫైనాన్స్ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇక, అవసరం లేని బ్యాంక్ అకౌంట్స్ ని వెంటనే క్లోజ్ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది ఆర్థికశాఖ.. మార్చి 10 వరకు వీటికి సంబంధించిన సమాచారాన్ని నిర్దేశిత ఫార్మాట్ లో ఫైనాన్స్ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది.. ఆయా డిపార్ట్‌మెంట్లు, వివిధ బ్యాంకుల్లో ఉన్న ఎఫ్‌డీలను ప్రభుత్వ ఎంపానెల్ బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని పేర్కొంది..

Read Also: Fodder Scam: నేను నిరాకరించా.. ఆయన మనుషులే లాలూపై కేసు పెట్టారు..!

అన్ని ఎఫ్‌డీలని ఒకే బ్యాంక్‌లో ఉండేలా చూడాలని… ఇష్టమొచ్చినట్టు ఎఫ్‌డీలు చేయడానికి వీలులేదని.. ఎఫ్‌డీలు ప్రభుత్వ లీడ్ బ్యాంక్‌లోనే చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా, కొన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన సొమ్మును వివిధ ఖాతాలను మళ్లించి నొక్కేసిన వ్యవహారాలు, ఎఫ్‌డీలను డ్రాచేసిన ఘటనలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది..

Exit mobile version