Site icon NTV Telugu

Nomination Candidates: అభ్యర్థుల నామినేషన్లలో ‘వి’చిత్రాలు.. అసలు పేరు ఒకటి వాడుకలో మరొకటి

Telangana Election 2023

Telangana Election 2023

Nomination Candidates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓ విచిత్రం వెలుగులోకి వచ్చింది. నామినేషన్ పత్రాల్లో… కొత్తవారిలా కనిపించే కొందరు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వారి అసలు పేరు ఒకటి.. వాడుకలో మరొకటి కావడం అందరికి అయోమయానికి గుర్తు చేస్తుంది. వారిలో ప్రముఖులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, మధు యాష్కీ, పద్మాదేవేందర్ రెడ్డి. బీఆర్‌ఎస్ అభ్యర్థి అసలు పేరు ఇరుకుల బాలకిషన్, రసమయి బాలకిషన్ అని పిలుస్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో రసమయి అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి కష్టపడి పనిచేశారని, దాని వల్ల ఇంటిపేరు మారి రసమయి బాలకిషన్ గా ప్రాచుర్యం పొందారు. సీతక్క ములుగు కాంగ్రెస్ అభ్యర్థి. ఆమె అసలు పేరు ధనసరి అనసూయ. ఈ పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

ధనసరి అనసూయ సీతక్కగా ఎందుకు మారాల్సి వచ్చిందంటే.. నక్సలిజం సమయంలో సీతక్కగా పేరు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చి అదే పేరుతో రాజకీయాల్లో కొనసాగుతోంది. బాన్సువాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డిదీ ఇదే కథ. ఆయన అసలు పేరు పెరిగె శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ అనే పేరుతో ఎక్కువ మందికి తెలుసు. అందుకే తన పేరు అతని స్వగ్రామం బాన్సువాడ మండలం పోచారం గ్రామంతో ముడిపడి ఉంది. దీంతో ఆయన స్వగ్రామం ఇంటిపేరుగా మారి పోచారం శ్రీనివాస్ రెడ్డిగా మారారు. జగిత్యాల నుంచి బీజేపీ అభ్యర్థిగా బండారు శ్రావణి పోటీ చేస్తున్నారు. ఈమె ఎవరో తెలియదు అనుకుంటున్నారా? భోగ్ శ్రావణి…అంటే మీకు గుర్తుండే ఉంటుంది…ఈ రెండూ ఒకటే..అసలు పేరు బండారు శ్రావణి. అత్తగారి ఇంటి పేరు భోగ. అందుకే ఇది బోగ శ్రావణిగా వాడుకలో ఉంది. కాగా.. నామినేషన్ పాత్రలో మాత్రం బండారు శ్రావణి గానే దాఖలు చేశారు. చివరకు పద్మాదేవేందర్ రెడ్డి. ఆయన మెదక్ బీఆర్‌ఎస్ అభ్యర్థి. ఆమె అసలు పేరు మాధవ రెడ్డి గారి పద్మ. కానీ రాజకీయాల్లో మాత్రం పద్మ దేవేందర్ రెడ్డి పేరుతో గుర్తుంపు పొందారు.
Rohit Sharma: అహ్మదాబాద్ పిచ్ ను పరిశీలించిన రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ

Exit mobile version