Site icon NTV Telugu

ప్రత్యక్ష తరగతులపై విద్యాశాఖ ప్రతిపాదనలు..

Classes

Classes

కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇదే సమయంలో.. జులై 1వ తేదీ నుంచి పాఠశాలలను తిరి ప్రారంభిస్తామని ప్రకటించింది.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించి ఈ నిర్ణయానికి వచ్చారు.. ఇక, రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభం, ప్రత్యక్ష తరగతుల పై పాఠశాల విద్యాశాఖ కొన్ని ప్రతిపాదనలు చేసింది.. జులై 1వ తేదీ నుండి 8, 9, 10 తరగతులు ప్రారంభం కానుండగా.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు క్లాస్‌లు నిర్వహించాలని.. జులై 20వ తేదీ నుండి 6, 7 తరగతులు ప్రారంభించాలని.. ఇక, ఆగస్టు 16వ తేదీ నుంచి 3, 4, 5 తరగతులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది పాఠశాల విద్యాశాఖ.

Exit mobile version