NTV Telugu Site icon

Hyderabad Manhole: మ్యాన్ హోల్ ప్రమాదాలపై తెలంగాణ డీజీపీ సూచనలు..

Hyderabad Manhole

Hyderabad Manhole

Hyderabad Manhole: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నందున రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో.. రుతుపవనాలు వేగంగా విస్తరించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రుతుపవనాల నేపథ్యంలో వాహనదారులకు తెలంగాణ డీజీపీ రవిగుప్తా కీలక సూచనలు చేశారు. వర్షం వస్తే మ్యాన్‌హోల్స్‌ తెరుచుకోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా వాహనాలు స్కిడ్ అవుతున్నాయి. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని తెలంగాణ డీజీపీ ప్రయాణికులకు కోరారు.

Read also: Hyderabad Metro: పెరగనున్నమెట్రో ఛార్జీలు..! ఇందులో నిజమెంత?

డీజీపీ సూచనలు..

* సంబంధిత వాహన నిపుణులతో మీ వాహనం టైర్ల గ్రిప్/థ్రెడ్ స్థితిని తనిఖీ చేయండి. టైర్లు గ్రిప్పీగా లేకుంటే, వెంటనే వాటిని మార్చండి.
* మీ వాహనం టైర్లలో గాలిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
* వర్షం పడుతున్నప్పుడు పరిమిత వేగంతో నడపడం మంచిది.
* మీ వాహనం ఇంజిన్ పరిస్థితిని తనిఖీ చేయండి. బ్రేక్ ప్యాడ్‌లు మరియు విండ్‌స్క్రీన్ వైపర్‌ల పరిస్థితిని రెండుసార్లు తనిఖీ చేయండి.
* అవసరమైతే మీ వాహనాల్లో అత్యవసర కిట్‌లు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి.
* అత్యవసర పరిస్థితుల్లో #Dial100కి కాల్ చేయడానికి మీ మొబైల్/ మీ వాహనంలో వీలైతే స్పీడ్ డయల్‌ని సెటప్ చేయండి.
* ఈ సూచనలు మీకు, మీ కుటుంబ భద్రతకు చాలా మంచివన్నారు.

తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Maoist Landmines: దడ పుట్టిస్తున్న మందు పాతరలు.. ఏజెన్సీలో టెన్షన్ టెన్షన్..