తెలంగాణలో భూ సంస్కరణల కోసం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ పురోగతిపై జిల్లా కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్. ధరణి పోర్టల్ అమలులో సాధించిన పురోగతిని సమీక్షించిన సీఎస్ సోమేశ్ కుమార్ పలు సూచనలు చేశారు. ధరణి పోర్టల్ విజయవంతంగా అమలు చేయడంపై జిల్లా కలెక్టర్లు , ఇతర ఉన్నతాధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ధరణి పోర్టల్ ను ఇతర రాష్ట్రాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
ధరణి ప్రారంభించినప్పటి నుండి 10.35 లక్షలకు పైగా స్లాట్లు బుక్ అయ్యాయని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిష్కారానికి ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని సీఎస్ అన్నారు.పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు.దరఖాస్తుల పరిష్కారం చేయడంలో, సూర్యాపేట, రంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ మరియు మెదక్ కలెక్టర్లు వారి అనుభవాలను ఈ సమావేశంలో వివరించారు.
