తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,660 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 23 మంది కరోనాబారినపడి మృతిచెందగా.. ఇదే సమయంలో 4,826 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,44,263కు పెరగగా.. రికవరీలు 4,95,446గా చేరాయి.. ఇక, ఇప్పటి వరకు 3060 మంది మృతి చెందగా.. ప్రస్తుతం 45,757 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. రివకరీ రేటు రాష్ట్రంలో 91.03 శాతానికి పెరిగిందని తెలియజేశారు.. ఇక, గత 24 గంటల్లో 69,252 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా జీహెచ్ంఎసీ పరిధిలో 574 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 218, ఖమ్మంలో 217, నల్గొండలో 166 కేసులు వెలుగు చూశాయి.
తెలంగాణ కోవిడ్ అప్‌డేట్.. ఇవాళ కేసులంటే..?
Covid 19